కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా అకానె యమగుచి (జపాన్)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–11తో తొలి గేమ్‌ను గెలిచింది.
ఈ దశలో మోకాలి గాయంతో యమగుచి మ్యాచ్ నుంచి వైదొలిగింది. మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 10–21, 21–23తో ఫజర్ అల్ఫియాన్–మహ్మద్ ఫిక్రి (ఇండోనేసియా) చేతిలో ఓడారు.
