
పొక్ హరా(నేపాల్ ): మాల్దీవ్స్ విమెన్స్ క్రికెట్ టీమ్ శనివారం ఓ చెత్త రికార్డును తమ పేరిట రాసుకుంది. సౌత్ ఏషియా గేమ్స్‌లో భాగంగా నేపాల్‌తో శనివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో మాల్దీవ్స్ ఎనిమిది రన్స్‌కే ఆలౌటైంది. ఓపెనర్ ఐమా ఐష్ హత్ ఒక్క రన్ చేయగా మిగిలిన ఏడు రన్స్ ఎక్స్‌ట్రాల (వైడ్స్) రూపంలో వచ్చాయి. జట్టులో తొమ్మిది మంది బ్యాటర్లు డకౌటయ్యారు. కెప్టెన్ జునా మరియం అత్యధికంగా 16 బాల్స్ ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయింది. ఆరో రోజుల కిందట మాల్దీవ్స్‌పై ఒక్క పరుగు ఇవ్వకుండా ఆరు వికెట్లు తీసి వరల్డ్ రికార్డు సృష్టించిన నేపాల్ బౌలర్ అంజలి(4/1) ఈసారి ఒకే రన్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. అనంతరం ఏడు బాల్స్ ఆడిన నేపాల్ ఓపెనర్లు స్వల్ప లక్ష్యాన్ని పూర్తి చేశారు. మాల్దీవ్స్ చేసిన ఎనిమిది రన్స్ విమెన్స్ ఇంటర్నేషనల్ టీ20ల్లో థర్డ్ లోయెస్ట్ స్కోరు. ఆరు రన్స్ చేసిన మాలీ జట్టు ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది.