- మల్కాజిగిరి ఏసీపీ సూచన
మల్కాజిగిరి, వెలుగు: నగరంలో పనిమనుషులు, వాచ్మెన్ల ముసుగులో జరుగుతున్న వరుస దోపిడీల నేపథ్యంలో నేరేడ్మెట్ పోలీసులు బుధవారం వాయుపురి, డిఫెన్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మల్కాజిగిరి ఏసీపీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. నేరస్తులు ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, పనిమనుషులుగా చేరి నమ్మకం సంపాదించి దోపిడీలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
ఇంటి యజమానులు పనిమనుషులను నియమించుకునే ముందు వారి ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, ఫోన్ నంబర్లు వంటి వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, సాధ్యమైనంత వరకు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
