
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ చిలకరాజు పళని కుమారి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హయత్ నగర్ వినాయకనగర్లోని ఆమె ఇంట్లో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగనున్నట్లు సమాచారం.
ఏసీబీ సోదాల్లో పళని ఇంటి నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇండ్లలోనూ ఏకకాలంగా సోదాలు చేస్తోంది. పళని గతంలో అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు.