మల్కాజ్ గిరిలో హోరాహోరీ

మల్కాజ్ గిరిలో హోరాహోరీ

టీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడి పోటీ

కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చిన గులాబీ పార్టీ

కాంగ్రెస్ నుం చి పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి

రాంచందర్ రావును బరిలోకి దింపిన బీజేపీ

తొలిసారిగా జనసేన కూడా పోటీలోకి..

దేశంలోనే అతిపెద్ద లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గి రిలోఈసారి ఇంట్రెస్టిం గ్ ఫైట్ నడుస్తోం ది. సిటీ ఓటర్లతోపాటు సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో కాం గ్రెస్, టీఆర్ ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడు-తున్నా యి. పవన్ జనసేన తెలంగాణలో తొలిసారిగాపోటీ చేస్తోం ది. కాం గ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్ డిని పోటీకి దింపిం ది. రాష్ట్ర మంత్రి, టీఆర్ ఎస్ సిట్టిం గ్ఎంపీ మల్లారెడ్ డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్ డిని పోటీకి దింపింది. బీజేపీ నుంచి సీనియర్ నేత, ఎమ్మెల్ సీ ఎన్‌.రాంచందర్​రావు, జనసేన తరఫునమహేందర్‌రెడ్ డి బరిలో ఉన్నారు. 2009లో ఏర్పా-టైన ఈ సెగ్మెంట్​లో రెం డుసార్లు ఎన్నికలు జరగ్గా ..కాంగ్రెస్, టీడీపీ ఒక్కోసారి గెలిచాయి. టీఆర్​ఎస్,బీజేపీ బోణీ చేయలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనుంచి గెలిచిన మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఈసీటును అల్లుడు రాజశేఖర్​రెడ్డికి ఇప్పించుకున్నారు.

రేవంత్ కు కొత్త సవాల్

తొలిసారి ఎంపీగా పోటీ చేస్తు న్న రేవంత్ రెడ్డి సవాలుగా తీసుకున్నా రు. హైదరాబాద్ ను దేశానికి రెం డోరాజధానిగా చేసేం దుకు ప్రైవేటు బిల్లు పెడతామని,అన్ని పార్టీల మద్దతు పొందేం దుకు కృషి చేస్తామనిఆసక్తికరంగా ప్రచారం హోరెత్తిస్తున్నా రు. తొలిసా-రిగా లోక్​సభ బరిలోకి దిగడంతో అన్ని వర్గా లనూకలుపుకొనిపోయే పనిలో పడ్డారు. ఇప్పటికే దేవేందర్గౌడ్, గద్దర్, కోదండరాం తదితరుల మద్దతు కూడ-గట్టా రు. గతంలో రేవంత్ టీడీపీలో యాక్టివ్​ లీడర్.మల్కాజ్​గిరి సెగ్మెంట్​లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగాఉండటం, కాంగ్రెస్, టీడీపీ కేడర్​ ఉండటం ఆయనకుకలిసొస్తుం దని భావిస్తున్నా రు. అయితే స్థా నికుడు కా-కపోవటం, ఈ లోక్​సభ పరిధిలో ని అన్ని సెగ్మెంట్లనుటీఆర్​ఎస్​ గెలవడం, కాంగ్రెస్​ నేతలంతా వరుసగాపార్టీని వీడటం రేవంత్ కు ఇబ్బం దిగా మారే అంశం.

అల్లుడి ’ కోసం మల్లారెడ్డి

టీఆర్​ఎస్​ నుంచి పోటీలో ఉన్న రాజశేఖర్​రెడ్డి ఆపార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, రాజకీయాలకుపూర్తిగా కొత్త. మంత్రి మల్లారెడ్డి అల్లుడు కావటంతోఆయనకు ఎంపీ టికెట్​లభించిం ది. గత లోక్​సభఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మల్లారెడ్డి.. తర్వాతటీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఇటీవలి అసెంబ్లీఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి కేసీఆర్ కేబినెట్‌లోమంత్రి పదవి దక్కించుకున్నా రు. ఆయన అల్లుడురాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు కొత్త కావడంతో ప్ర-చారభారం మొత్తం మల్లారెడ్డి తన భుజాలకెత్తు కున్నా -రు. అయితే ఒకే కుటుంబానికి టికెట్లివ్వడంతో పార్టీకేడర్​లో అసంతృప్తి, ఎంపీగా ఉన్నప్పుడు మల్లారెడ్డిసెగ్మెంట్​ సమస్యలను పట్టిం చుకోకపోవటం, రాజశే-ఖర్​రెడ్డికి రాజకీయానుభవం లేకపోవడం ఇబ్బం ది-గా మారే అవకాశం ఉందని అంటున్నారు. మల్లారెడ్డిమాత్రం కేసీఆర్​ చేపట్టిన పథకాలు, తన విద్యా సంస్థ-ల్లో ని విద్యార్థు లు, వారి తల్లిదండ్రుల ఓటు బ్యాంకుతన అల్లుడిని కూడా గెలిపిస్తుం దని భావిస్తున్నా రు.సెగ్మెంట్​పరిధిలో ని అంతా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే లేఉండటం ప్లస్​ పాయింట్.

మళ్లీ బరిలో రాంచందర్​రావు

బీజే పీ నుం చి సీనియర్​ నేత రాంచందర్​రావుమరోసారి బరిలో నిలిచి తమ అదృష్టా న్ని పరీక్షిం-చుకుం టున్నారు. ప్రస్తు తం ఆయన ఎమ్మెల్ సీగాఉన్నా రు. గత లోక్ సభ ఎన్నికల్లో రాంచందర్​రావుఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఈ మేరకు సాను భూ-తితోపాటు సెగ్మెంట్​ప్రజలతో ఉండే సత్సంబంధాలుతనను గెలిపిస్తాయని విశ్వాసంతో ఉన్నా రు. గ్రేటర్హైదరాబాద్‌ పరిధిలో ని పలు నియోజకవర్గా ల్లోబీజేపీకి గట్టి పట్టు ఉంది. దీనికి తోడు ప్రధాని మోదీచరిష్మా, ఇక్కడున్న ఉత్తరాది ఓటర్ల మద్దతు తనకుకలిసొస్తుం దని భావిస్తున్నా రు.

16 సీట్లూ ఓడితే దిగొస్తరు

మూడు ఎమ్మెల్సీలు ఓడిపోతే కేసీఆర్ కుమత్తు దిగి.. పేదరైతు సమస్యనుపరిష్కరించారు. 16 ఎంపీ సీట్లన్నీ ఓడిస్తే సెక్రటేరియట్ లో ప్రజలకు అందుబాటులోకివస్తరు. విద్యతో వ్యా పారం చేసేవాళ్లు ఎంపీలైతే ప్రజలకు న్యాయం జరుగుతుందా? వారు ఎన్నడైనా పేదలకు సాయం చేశారా, కనీసం తమ కాలేజీలో ఫీజులుతగ్గిం చారా? నేను జనం కోసం పనిచేస్తా-  రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి

కేసీఆర్ ​పథకాలే గెలిపిస్తాయి

నియోజకవర్గం లో ఉన్న సమస్యలకుటీఆర్ఎస్ పార్టీయే పరిష్కారం చూపించింది.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తా యి.కేంద్రంలో టీఆర్ ఎస్ పార్టీ సత్తా చాటేలాగెలుపు దిశగా అడుగులు వేస్తున్నాం .రానున్న రోజుల్లో మౌలిక వసతులనుమెరుగుపరుస్త ాం. సెగ ్మెంట్ ను అభివృద్ధిచేసేందుకు కృషి చేస్తా. – మర్రి రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి.

మాతోనే సమస్యలకుపరిష్కారం

ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకుఅండగా ఉంటా. మోదీ సర్కారు చేసినపాలనా సంస్కరణలే నన్ను గెలిపిస్తాయి. కంటోన్మెంట్ పరిధిలో నె లకొన్న సమస్యలనుకేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కారిస్తా.మల్కాజ్ గిరిని అన్ని విధాలా అభివృద్ధిచేసేందుకు కృషి చేస్తా. బీజేపీ మద్దతుతోనే ఇక్కడి సమస్యలు తీరాయి.- ఎన్.రాంచందర్​రావు, బీజేపీ అభ్యర్థి