
కలెక్టర్కు మల్కాపూర్ రైతుల ఫిర్యాదు
15 రోజుల్లో సర్వే చేయించాలని వినతి
న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక
నిర్మల్, వెలుగు: రెండేళ్లుగా తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుబంధు స్కీమ్కింద డబ్బులు రావడం లేదని, ఈ నెల15 లోగా సర్వే చేసి.. తమకు న్యాయం చేయకుంటే కలెక్టరేట్దగ్గర ఆత్మహత్య చేసుకుంటామని మల్కాపూర్ రైతులు హెచ్చరించారు. గురువారం రైతులు నిర్మల్కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కేంద్రప్రభుత్వం నుంచిసాయం అందుతున్నా.. రైతుబంధు రావడం లేదన్నారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం మల్కాపూర్శివారులో 25 ఏండ్ల కింద 148 సర్వే నంబర్‍లో రైతులకు భూములు అసైన్చేశారు. రెండేళ్ల కింద ఎంజాయ్మెంట్సర్వే తర్వాత ఈ సర్వే నంబర్‍లోని 520 ఎకరాలకు రైతుబంధు సాయం ఆగిపోయింది. సర్వే చేసే సమయంలో ఈ భూములకు సంబంధించిన వివరాలు ఆన్‍లైన్‍లో నుంచి తొలగించారు. తర్వాత అర్హులను గుర్తించి పట్టాపాస్బుక్లు అందించినా ఆన్‍లైన్‍లో సైన్‍ఇన్ కాలేదు. దీంతో రైతుబంధుతోపాటు క్రాప్‍లోన్లు, ఇతర స్కీంలు అందడం లేదు. ధరణి వెబ్‍సైట్‍లో ఈ సర్వేకు సంబంధించిన భూములే కాదు.. సర్వే నంబర్ కూడా మీ సేవ ఆఫీసులో సైన్‍ఇన్ ఆప్షన్ లేకపోవడంతో ఏడాది నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్డీవోను పంపించి ఎంజాయిమెంట్ సర్వే చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని, 15 రోజులు చూసి తాము ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.