షర్మిల కొడుకు రిసెప్షన్‌కు ఖర్గే, కేసీ వేణుగోపాల్

షర్మిల కొడుకు రిసెప్షన్‌కు ఖర్గే, కేసీ వేణుగోపాల్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి రిసెప్షన్ శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వారు హైదరాబాద్‌కు వస్తున్నారు. వీరు పార్టీకి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రామ్‌లో పాల్గొనరని, కేవలం రిసెప్షన్‌కు అటెండ్ అయి, తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.