ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్

ప్రధాని మోడీపై ఖర్గే కామెంట్
  • గుజరాత్ బిడ్డను కాంగ్రెస్ అవమానిస్తున్నదని బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీని రావణుడితో పోల్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం అహ్మదాబాద్​లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ తన పనిని మరిచిపోయి కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

‘‘దేశంలోని ప్రతి ఎన్నిక ప్రచారంలోనూ మోడీ పాల్గొంటున్నారు. ఆఖరికి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తనను చూసి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. మేము ఎన్నిసార్లు మీ ముఖం(మోడీ) చూడాలి? మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? రావణుడి లాగా మీకు వంద తలలు ఉన్నాయా?” అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. గుజరాత్ బిడ్డను కాంగ్రెస్ అదేపనిగా అవమానిస్తోందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. ఎన్నికల వేడిని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, అందువల్లే ​ ఖర్గే  ఆవేశానికి లోనై మోడీని రావణుడితో పోల్చారని ఆయన అన్నారు.