శంషాబాద్ ఎయిర్ పోర్టులో.. ఖర్గేను కలిసిన భట్టి, మహేశ్ గౌడ్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో.. ఖర్గేను కలిసిన భట్టి, మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి గుల్బర్గా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. ఈ సందర్భంగా ఖర్గేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణు గోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. 

కొద్దిసేపు ఖర్గేతో రాష్ట్ర నేతలు మాట్లాడిన అనంతరం రోడ్డు మార్గం గుండా ఆయన గుల్బర్గా వెళ్లారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గే.. భట్టి, మహేశ్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.