ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఖర్గే

ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఖర్గే

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున్ ఖర్గే  ఇవాళ బాధ్యతలు చేపట్టారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో జాతీయాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి  CWC సభ్యులు, ఎంపీలు, PCC అధ్యక్షులు, CLP లీడర్లు హాజరయ్యారు. 24ఏళ్ళ తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈనెల 17న జరిగిన AICC అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై మల్లిఖార్జున ఖర్గే  గెలిచారు. 

కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే ముందు మల్లిఖార్జున్ ఖర్గే జాతీయ నేతలకు నివాళులర్పించారు.  రాజ్ ఘాట్ కు వెళ్ళి మహాత్మాగాంధీ సమాధిపై పూలు చల్లి గాంధీని స్మరించుకున్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమాధి అయిన వీర్ భూమి, ఇందిరా గాంధీ సమాధి శక్తి స్థల్ ను కూడా సందర్శించారు.  నేతలకు ఘనంగా నివాళులర్పించారు.  

కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గే 27యేళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు.  1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.  10సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన... 2009 నుంచి 2019 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.  AICC అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు ఆయన రాజ్యసభలో విపక్షనేతగా ఉన్నారు.