నలుపు ఖుర్తా, తలపాగా ధరించి రాజ్యసభలోకి ఖర్గే

నలుపు ఖుర్తా, తలపాగా ధరించి రాజ్యసభలోకి ఖర్గే

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి 'చలో రాష్ట్రపతి భవన్' మార్చ్ నిర్వహిస్తారని కూడా కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు నలుపు దుస్తుల్లో పార్లమెంటుకు చేరుకుంటున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పలువురు ఎంపీలు సైతం నలుపు రంగు దుస్తులు ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన ప్రతిప‌క్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా నలుపు రంగు దుస్తులు ధరించారు. నలుపు ఖుర్తా, తలపాగా ధరించి రాజ్యసభకు హాజరైన ఖర్గే... తన నిరసనను వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోలు, డీజీల్, గ్యాస్, జీఎస్టీ... ఇలా పలు దఫాలుగా రేట్లు పెంచడంతో సామాన్యునికి జీవితం గుది బండలా మారింది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ నిరసనగా... కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది.