బయట మాట్లాడితే.. సభలో అభ్యంతరం చెప్పడం సరికాదు : ఖర్గే

బయట మాట్లాడితే.. సభలో అభ్యంతరం చెప్పడం సరికాదు : ఖర్గే

తాను బయట చేసిన వ్యాఖ్యలపై.. అధికార బీజేపీ నేతలు రాజ్యసభలో అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ఈ మేరకు బీజేపీ నేతలు మాట్లాడిన బైట్స్ ను సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. లోక్ సభ, రాజ్యసభల బయట సభ్యులు మాట్లాడే అంశాలపై.. సభలో చర్చ జరగకుండా నిబంధనలు రూపొందించాలని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభలో జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడారు.

‘‘ఎవరైనా లోక్ సభ సభ్యుడు సభ బయట ఏమైనా మాట్లాడితే.. దానిపై రాజ్యసభలో చర్చించరని... ప్రత్యేకించి సభను నడిపించే ఒక వ్యక్తే.. ఇలాంటి అంశంపై కామెంట్ చేయడం దురదృష్టకరం. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు’’ అని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను సభ బయట ఏదైనా మాట్లాడితే దాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు ?’’ అని ఆయన ప్రశ్నించారు.