అబద్ధాల ప్రచారమే మోదీ గ్యారంటీ: ఖర్గే

అబద్ధాల ప్రచారమే మోదీ గ్యారంటీ: ఖర్గే
  • ఎక్కడైనా అబద్ధాలే చెప్తరు: రాహుల్ 

న్యూఢిల్లీ: దేశంలోని సమస్యలపై మాట్లాడ టానికి బదులుగా కాంగ్రెస్ పై విమర్శలు చేయడంపైనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని స్పీచ్​పై ఆయన మండిపడ్డారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా, ప్రధాని మాత్రం కాంగ్రెస్​పై విమర్శలకే పరిమితం అయ్యారన్నారు.

రాజ్యాంగంపై నమ్మకం లేని వాళ్లే దేశభక్తి గురించి కాంగ్రెస్​కు పాఠాలు చెప్తున్నారన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో కాంగ్రెస్​పై మోదీ తప్పుడు విమర్శలు చేశారని, అబద్ధాలను ప్రచారం చేయడమే మోదీ గ్యారంటీ అని ఖర్గే ఎద్దేవా చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా ఉండదు. 2021 జనాభా లెక్కలు చేపట్టలేదు. నిరుద్యోగ డేటా లేదు. హెల్త్ సర్వే లేదు.

ఎన్డీఏ అంటే.. నో డేటా అవైలబుల్ అన్నట్టుగా మారింది” అని ఖర్గే విమర్శించారు. కేంద్రం అన్ని గణాంకాల నూ దాచిపెట్టి.. అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. కాగా, పార్లమెంట్​లో అయినా, బహిరంగ సభల్లో అయినా మోదీ కేవలం అబద్ధాలే చెప్తారంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.