ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? క్రోమ్ బ్రౌజర్ తో తస్మాత్ జాగ్రత్త..!

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? క్రోమ్ బ్రౌజర్ తో తస్మాత్ జాగ్రత్త..!

సెల్ ఫోన్ లేనిదే ఏ పని జరగనంతగా తయారయ్యింది నేటి పరిస్థితి. ల్యాండ్ ఫోన్ కాలంలో విలాసాల్లో ఒకటిగా ఉన్న ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగంలో నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయింది. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ అన్నది తప్పనిసరి అయ్యింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక మన డే టు డే లైఫ్ ఎంత కంఫర్టబుల్ గా మారిందో కొన్ని కొన్ని సందర్భాల్లో అంతే ప్రమాదాలను సైతం తెచ్చిపెడుతోంది. స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగించటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల మాట అటుంచితే, మన వ్యక్తిగత సమాచార దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది.

మనం రెగ్యులర్ గా వాడే గూగుల్ క్రోమ్ యాప్ ఇప్పుడు ముప్పు తెచ్చిపెడుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు క్రోమ్ బ్రౌజర్ ని వాడుతుంటారు. ఇప్పుడు హ్యాకర్లు క్రోమ్ ఆసరాగా చేసుకొని మన పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నారు. ఏదైనా యాప్ ని ప్లేస్టోర్ నుండి కాకుండా క్రోమ్ ద్వారా APK రూపంలో ఇన్స్టాల్ చేస్తే మన మెసేజెస్, కంటాక్స్ వంటి డేటాకి యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు హ్యాకర్స్ కి మార్గం సుగమం చేస్తోంది.

ALSO READ :- పొలిటికల్ లీడర్గా కేటీఆర్ డిజాస్టర్ : బండ్ల గణేష్

ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ McAfee కథనం ప్రకారం గూగుల్ ప్లేస్టోర్ నుండి కాకుండా బయటి నుండి ఇన్స్టాల్ చేసే యాప్స్ ప్రమాదకరం అని, వాటివల్ల మన ఫోన్లో మాలవెర్ చేరే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మాల్వేర్ బారిన పడకుండా ఉండాలంటే  ఆండ్రాయిడ్ యూజర్లు అందరూ తప్పకుండా గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ని ఎనేబుల్ చేసుకోవాలని తెలిపింది.