మహిళలపై దాడులు ఆపేందుకు కఠిన చట్టాలు చేయండి... ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

మహిళలపై దాడులు ఆపేందుకు కఠిన చట్టాలు చేయండి... ప్రధాని మోదీకి సీఎం మమత లేఖ

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడుల నియంత్రణకు, రేప్ కేసుల్లో సత్వర న్యాయం కోసం కఠిన చట్టాలను తేవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా రోజుకు 90 అత్యాచారాలు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తేవాలని , విచారణ 15 రోజుల్లో పూర్తవ్వాలని, బాధితులకు న్యాయం దక్కేలా చూడాలని లేఖలో ప్రధానిని కోరారు.