నీట్ పరీక్ష రద్దు చేసి.. పాత పద్దతిలో నిర్వహించాలి: మోదీకి మమతా బెనర్జీ లెటర్ 

నీట్ పరీక్ష రద్దు చేసి.. పాత పద్దతిలో నిర్వహించాలి: మోదీకి మమతా బెనర్జీ లెటర్ 

నీట్ పరీక్షను రద్దు చేయాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గతంలో ఈ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేవి.. ప్రస్తుత నీట్ విధానాన్ని రద్దు చేసి.. పాత పద్దతిలో పరీక్షలు నిర్వహించాలని మమతా బెనర్జీ సోమవారం (జూన్ 24) ప్రధాని మోదీకి లెటర్ రాశారు. నీట్ పరీక్షల్లో పేపర్ లీకులతో నీట్ పరీక్షా విధానంపై విద్యార్థులకు నమ్మకం లేదని అన్నారు. 

2017కి ముందు రాష్ట్రాలు మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షలను సజావుగా నిర్వహించుకున్నాయని మమత అన్నారు. నీట్ విధానంలో పరీక్షలు ధనవంతులకే ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. నీట్ పరీక్షలో భారీగా అవినీతి జరిగిందన్నారు మమతా బెనర్జీ. 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను వెంటనే రద్దు చేసి మునుపటి పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా మెడికల్ పరీక్షలు నిర్వహించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని మమత లెటర్ లో డిమాండ్ చేశారు.