ప్రతి పక్షాలకు మమతా బెనర్జీ లేఖ

ప్రతి పక్షాలకు మమతా బెనర్జీ లేఖ

 

  • రాష్ట్రపతి ఎన్నికను వేదికగా చేసుకుందాం
  • సోనియా, కేసీఆర్​ సహా 22 మందికి మమతా బెనర్జీ లేఖ
  • 15న  ఢిల్లీలో సమావేశం

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలు అనుసరిస్తున్నదని, అందుకు దీటైన జవాబు చెబుదాం రావాలంటూ ఏఐసీసీ చీఫ్​ సోనియాగాంధీ సహా 22 మంది నేతలకు బెంగాల్‌‌ సీఎం, తృణమూల్​ కాంగ్రెస్​ చీఫ్​ మమతా బెనర్జీ శనివారం లేఖలు రాశారు. సీఎం కేసీఆర్‌‌కు కూడా ఆమె ఆహ్వానం పంపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను టార్గెట్‌‌ చేస్తూ వారిపై జాతీయ సంస్థలను ప్రయోగిస్తున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బలమైన ప్రతిపక్షం అవసరం ఎంతో ఉందని లేఖల్లో తెలిపారు. ఈ ప్రభుత్వం తీరుతో ప్రపంచంలో దేశ ప్రతిష్ట మసకబారుతున్నదన్నారు. బీజేపీకి బలమైన సమాధానం చెప్పేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రపతి ఎన్నికలను వేదికగా చేసుకొని దేశంలో బలమైన ప్రతిపక్ష వేదిక ఏర్పాటుకు ప్రయత్నిద్దామని చెప్పారు. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్‌‌స్ట్యూషన్‌‌ క్లబ్‌‌లో నిర్వహించే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వహించే ఈ సమావేశానికి కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ సోనియాగాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్‌‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే, జార్ఖండ్‌‌ సీఎంహేమంత్‌‌ సోరెన్‌‌, ఒడిశా సీఎం నవీన్‌‌ పట్నాయక్‌‌, పంజాబ్‌‌ సీఎం భగవంత్‌‌ మాన్‌‌తో పాటు మొత్తం 22 మంది నేతలను ఆహ్వానించారు.