మమ్ముట్టి-జ్యోతిక సినిమా.. ఆ రెండు దేశాల్లో బ్యాన్

మమ్ముట్టి-జ్యోతిక సినిమా.. ఆ రెండు దేశాల్లో బ్యాన్

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ కాథల్-ది కోర్‌ (Kadal The Core). ఈ సినిమాలో మమ్ముట్టికి జోడిగా జ్యోతిక(jyothika) నటించనుంది. జో బేబి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నవంబర్ 23న వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ కానుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..కాదల్ ది కోర్ మూవీకి బిగ్ షాక్ తగిలింది.మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీని గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతర్ దేశాలు బ్యాన్ చేశాయి. ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం..స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడం వల్లే..ఆ రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే విషయంపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆడియాన్స్ను ఆకట్టుకుంటున్నాయి. 

IFFI సినాప్సిస్ ప్రకారం..ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన జార్జ్‌ దేవసి (మమ్ముట్టి) తన భార్య ఓమన (జ్యోతిక)తో కలిసి నివసిస్తుంటాడు. ఊరిలో జరిగే పంచాయితీ ఎలక్షన్స్లో అతడు నిలబడదామనుకుంటాడు. అతని భార్య (జ్యోతిక) విడాకులకు అప్లై చేయడంతో..కథ చాలా కాంప్లిక్స్ గా జరుగుతుందని సమాచారం. అదే గ్రామంలో డ్రైవింగ్‌ స్కూల్ నడుపుతోన్న ఓ స్నేహితుడితో జార్జ్‌ గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. 

జార్జ్‌ లైంగిక ధోరణిని తాను నేరంగా చూడడం లేదని..కేవలం విడాకులు మాత్రమే కోరుతున్నట్లు కోర్టుకు వెల్లడిస్తుంది. దీంతో అతడు పోటీలో నిలబడటంపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, జార్జ్‌ మాత్రం అతనిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? జార్జ్‌ ఎన్నికల్లో పోటీ చేశాడా? వీరికి కోర్టు నుండి విడాకులు వచ్చాయా? లేదా అనేది మిగతా కథ. కాథల్-ది కోర్‌మూవీని మమ్ముట్టి అండ్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

రీసెంట్గా మమ్మూట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad). గత నెల 2023 సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైన ఈ సినిమా మలయాళ బాక్సాఫీసును దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చిన క‌న్నూర్ స్క్వాడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. 

ALSO READ :- అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన డీఎంకే