మన దేశంలో రైళ్లలో, ముఖ్యంగా జనరల్ బోగీల్లో శుచీ, శుభ్రత ఎంత గొప్పగా ఉంటాయో అందరికీ తెలిసిందే. పల్లీలు తిని పొట్టు అక్కడే పడేస్తుంటారు. కాయలు తిని తొక్కలు అక్కడే పడేస్తారు. ఈ మనిషైతే.. అత్యంత రద్దీగా ఉన్న జనరల్ బోగీలో సీటు దగ్గరే మూత్రం పోశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మద్యం తాగేసి ఉన్నాడో ఏంటో తెలియదు గానీ.. మరీ ఇంగిత జ్ఞానం లేకుండా సదరు వ్యక్తి ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
टीटी टिकट चेक कर रहा था, भाई ने सीधे चरित्र प्रमाण पत्र ही कैंसिल करवा लिया। 🤡 pic.twitter.com/LU1bmAHNnn
— खुरपेंची ढांचे (@Khurpenchinfra) September 26, 2026
మన దేశంలో రైళ్లలో జనరల్ బోగీలపై ఇప్పటికే చులకన భావం ఉంది. ఇలాంటి కామన్ సెన్స్ లేని మనుషుల వల్ల ఇండియన్ రైల్వేస్ మరింత పలుచనైపోతున్న పరిస్థితి. తోటి ప్రయాణికులు మూత్రం పోస్తున్న వ్యక్తిని అడ్డుకుని.. టాయిలెట్కు వెళ్లాలని చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో.. ప్రయాణికులు అతనితో గొడవకు దిగారు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతనిపై దాడి చేశారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని అదే బోగీలోని ప్రయాణికులు చెప్పడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఈ ఘటన రద్దీగా ఉండే మన దేశపు రైలు బోగీల్లో ప్రయాణికుల తీరుపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ వీడియోపై రైల్వే సేవా కూడా స్పందించింది. ఈ ఘటన ఏ రైలులో జరిగిందో పూర్తి వివరాలు తెలియజేయాలని ప్రయాణికులను కోరింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను.. రైలు నంబర్, (పీఎన్ఆర్ నంబర్), మొబైల్ నంబర్, తేదీ, సమయం తెలియజేయాలని సూచించింది. సమాచారం ఆధారంగా, ఈ విషయంపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. త్వరిత పరిష్కారం కోసం ఫిర్యాదును నేరుగా https://railmadad.indianrailways.gov.inలో కూడా నమోదు చేయవచ్చని సూచించింది.
