
వరంగల్: గత రాత్రి 9నెలల చిన్నారి శ్రీహితపై ఆత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌ను బుధవారం హన్మకోండ పొలీసులు అరెస్టు చేశారు. అతనిపై సెక్షన్ 366,302,376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతో పాటు 5(యం) రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లుగా పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ హన్మకోండలో ఓ హోటల్ లో క్లీనర్ గా పనిచేసేవాడు. స్థానికంగా ఉన్న కుమార్ పల్లి ప్రాంతంలో నివాసముంటున్న అతను మంగళవారం అర్ధరాత్రి తొమ్మిది నెలల చిన్నారిపై ఆత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.