ట్రాన్స్‌జెండ‌ర్లే అత‌ని టార్గెట్‌

ట్రాన్స్‌జెండ‌ర్లే అత‌ని టార్గెట్‌
  • భార్య పుట్టింటికి వెళ్లడానికి వాళ్లే కారణమని..
  • మా మూళ్లు వసూళ్లు, ఇవ్వకుంటే దాడులు
  • గతంలోనే ఆరుగురు సభ్యుల ముఠా ఆటకట్టు
  • తాజాగా టీమ్ లీడర్ అరెస్టు

హైదరాబాద్, వెలుగు: భార్యా పిల్లలున్నా ఓ ప్రబుద్ధుడు ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేశాడు. వదిలించుకోవాలని చూడడంతో సదరు ట్రాన్స్ జెండర్ నానా రభస చేసింది. ఈ సీన్ చూసి భార్య పిల్లల్తో సహా పుట్టింటికి వెళ్లిం ది. తనను కుటుంబానికి దూరం చేసిందో ట్రాన్స్ జెండర్ కాబట్టి..  మొత్తం కమ్యూనిటీనే టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడిన వ్యక్తిని సిటీ వెస్ట్ జోన్ పోలీసులు గురువారం  అరెస్ట్ చేశారు. వెస్ట్​జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కుర్మ వెంకటేశ్ అలియాస్  గ్రానైట్ వెంకట్, వెంకట్ యాదవ్ . ఇతడి సొంతూరు అనంతపురం జిల్లా రాప్తాడు కకలపల్లి.  పెళ్లైన తర్వాత 2009 నుంచి 2015 వరకు ట్రాన్స్ జెండర్ దివ్యతోనే సహజీవనం చేశాడు. వెంకట్, దివ్య కలిసి బెంగళూర్, ఢిల్లీలో కొంత కాలం గడిపాక ఆమెను వదిలి భార్య చెంతకు చేరాడు. అప్పటికే అతని భార్య కవలలకు జన్మనిచ్చింది. తనను వదిలి వచ్చిన వెంకట్ ను దివ్య వెంటాడుతూ వచ్చి ఇంటి వద్దగొడవ చేసింది. దీంతో వెంకట్ ను వదిలి అతని భార్య పుట్టిం టికి పోయింది. తాను భార్యాపిల్లలకు దూరం కావడానికి దివ్య కారణమైందని, అందువల్ల ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీపైనే వెంకట్ కక్ష పెంచుకున్నాడు.

ఆరుగురితో ముఠా

2014 నుం చి సికిం ద్రాబాద్, మాదాపూర్, కె.పి.హెచ్.బి, సనత్ నగర్, బంజారా హిల్స్, ఎల్బీన-గర్, కూకట్ పల్లిలో హిజ్రాలపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్డాడు. మరో ఆరుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఇందిరానగర్ అడ్డాగా నాలుగు దోపిడీలు చేశాడు. స్థానికంగా  హిజ్రా కమ్యూనిటీ ఉన్న ఏరియాల్లో  నెలనెలా మామూ ళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. సనత్ నగర్ కు చెందిన సాయి పహిల్వాన్ అనే రౌడీ షీటర్ తో కలిసి ట్రాన్స్ జెండర్స్ పై దాడులు, దోపిడీలు చేశాడు.

 యాస్మీన్ ఫిర్యాదుతో చిక్కాడు

గత సెప్టెంబర్ 27న వీరిద్దరూ ట్రాన్స్ జెండర్ యాస్మీన్ ఇంట్లోకి చొరబడి తీవ్రంగా గాయపరిచారు. నెల మామూ ళ్లు ముట్టజె ప్పలేదంటూ ఇంటిని ధ్వంసం చేశారు. యాస్మీన్ తో ఉన్న ఆమె కూతురు చంపేస్తామని  బెదిరించారు. అల్మారా తాళాలు లాక్కొని అందులోని 50 గ్రాముల బంగారం, రూ 2లక్షలు ఎత్తుకెళ్లారు . దీంతో యస్మీన్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిం ది. కేసు నమోదు చేసి వేట మొదలు పెట్టింది డీఐ రవికుమార్ టీమ్. వెంకట్ ముఠా సభ్యులైన సాయి పహిల్వాన్, బంటి యాదవ్, మధ్యల కళ్యాన్, కంబాలపల్లి వికేష్, నక్సండి అనిల్ కుమార్, మంజన్ సాయి కుమార్ లను గత అక్టోబర్ 6న అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ ఆరుగురు యస్మీన్ తమకు ఫిర్యాదు చేసిన రోజు దోపిడికీ పాల్పడ్డారు . కుర్మ వెంకటేష్ పై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 10 కేసులు ఉన్నాయి.