కేటి దొడ్డి మండలంలోని బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

కేటి దొడ్డి మండలంలోని బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

కేటి దొడ్డి, వెలుగు: బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అరెస్ట్​చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను గార్లపాడుకు చెందిన తెలుగు ఆంజనేయులు మాయమాటలు చెప్పి, కిడ్నాప్​చేసి, పెళ్లి చేసుకున్నాడన్నారు.

బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి, మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.