హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నసీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గోపినగర్ లో నివసిస్తున్న నసీర్ ను అతని స్నేహితులు నిన్న రాత్రి ( ఫిబ్రవరి 21) నీతో మాట్లాడాలని తీసుకెళ్లారు. తరువాత అర్దరాత్రి 12 గంటల సమయంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి నసీర్ ను అతని స్నేహితులు తీసుకొచ్చారు. అయితే అప్పటికే నసీర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు .. మృతుడి స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
