ఆర్మీ జవాన్​ తల్లిపై దాడి

ఆర్మీ జవాన్​ తల్లిపై దాడి

కాగజ్ నగర్, వెలుగు: ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో ఒక జవాన్​ తల్లి మీద మంగళవారం దాడి జరిగింది. ముత్యంపేటకు చెందిన గాదిరెడ్డి శ్రీనివాస్​ రెండేళ్ల నుంచి ఆర్మీలో జవాన్​గా పనిచేస్తున్నాడు. అతని తల్లి నాగమ్మ ఉంటున్న ఇంటి స్థలం తనదేనంటూ కమలాకర్​ ప్రకాశ్​రావు అనే వ్యక్తి మంగళవారం గొడవకు దిగాడు. ఇంట్లో కోడలితో పాటు చేసుకుంటున్న నాగమ్మమీద కర్రతో దాడి చేశాడు. దాడిలో గాయపడిన నాగమ్మ కౌటాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

జవాన్​ తండ్రి నాగులు 20 ఏండ్ల కిందటే సర్వేనంబర్​19లోని తొమ్మిది గుంటల భూమిని ప్రకాశ్​రావు పాలోళ్ల దగ్గర కొన్నాడు. కొంత కాలానికి ఆయన చనిపోగా నాగమ్మ ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటోంది. ఈ భూమి తనదేనని కొన్ని నెలలుగా ప్రకాష్​రావు గొడవ పడుతున్నాడు. మంగళవారం ఏకంగా దాడికి దిగడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. లాండ్​తో ప్రకాశ్​రావుకు ఏ సంబంధం లేదని వారంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం