- బాధితుడు మెదక్జిల్లా వాసి
చార్మినార్, వెలుగు: ఆస్తుల వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటన గురువారం సాయంత్రం ఛత్రినాక పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన సురేందర్ ప్రస్తుతం సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన ఘర్షణల కారణంగా మనస్తాపానికి గురై, ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోటేశ్వర్ రావు తెలిపారు.
