విజయవాడలోని సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు. భార్య తలనరికి, ఆ తలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళాడు. రోడ్డుపై ఉన్న జనాలు ఆ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురై.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. వారంతా పెద్దపెద్దగా కేకలు వేయడంతో అతడు ఆ తలను బుడమేరులో పడేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి తిన్నగా నడుచుకుంటూ వెళ్లి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను రాబడుతున్నారు. నిందితుడు కుమార్ అని, మృతురాలు మణిక్రాంతి ప్రాథమిక విచారణలో తెలిసింది.
