ఆదిలాబాద్ జిల్లాలో దారుణం... తాగి గొడవ చేస్తున్నాడని ప్రశ్నిస్తే..  స్నేహితుడిని గొంతు నులిమి చంపేశాడు..

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం... తాగి గొడవ చేస్తున్నాడని ప్రశ్నిస్తే..  స్నేహితుడిని గొంతు నులిమి చంపేశాడు..

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తాగి గొడవ చేస్తున్నాడని ప్రశ్నించినందుకు స్నేహితుడిని గొంతు నులిమి చంపేశాడు ఓ వ్యక్తి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారి గూడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బంగారి గుడకు చెందిన షేక్ జమీర్, రాజేష్ ఇద్దరు స్నేహితులు. తాగి గొడవ చేస్తున్నాడని జమీర్ ను ప్రశ్నించాడు రాజేష్. ఈ క్రమంలో మద్యం మత్తులో రాజేష్ తో వాగ్వాదానికి దిగాడు జమీర్.

రాజేష్, జమీర్ మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో స్నేహితుడు అన్న విచక్షణ కూడా లేకుండా రాజేష్ గొంతు నులిమి ఇసుకలో తొక్కి చంపేశాడు జమీర్. సమాచారం అందుకున్న పోలీసులు జమీర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ హత్య పై సోషల్ మీడియాలొ రేచ్చగోట్టేలా వైరల్  చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ ఉందని..ఆందోళనలు చేస్తే చర్యలు తీసుకున్తమని హెచ్చరించారు పోలీసులు. రాజేష్ మరణంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.