ట్రీట్మెంట్ తీసుకుంటూ వ్యక్తి మృతి..జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత

ట్రీట్మెంట్ తీసుకుంటూ వ్యక్తి మృతి..జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత

జనగామ జిల్లా గుమ్మడవెల్లి కి చెందిన నాగరాజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 7న లింగాల ఘన్పూర్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాగరాజును.. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అపోలోఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే నాగరాజు చనిపోయాడంటూ బంధువుల ఆందోళనకు దిగారు. చందాలు తీసుకొని ఆస్పత్రి బిల్లులు చెల్లించిన మనిషిని బ్రతికించే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 9 లక్షల చెల్లించగా మరో 15 లక్షలు చెల్లించాలంటూ ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి దగ్గరకు బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బంధువులను శాంతి పర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కేవలం చేతికి దెబ్బ తగిలిన వ్యక్తిని కానరాని లోకాలకు పంపించారంటూ నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.