
- డ్రైవర్‌కు గాయాలు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధిలో ముందు వెళ్తున్న డీసీఎంను మరో డీసీఎం ఢీకొనడంతో క్యాబిన్లో ఇరుక్కుని వ్యక్తి మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. ఇన్ స్పెక్టర్ బాలరాజు వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లికి చెందిన కాల్వ ఐలయ్య (40) గుండ్ల పోచంపల్లిలో నివాసం ఉంటూ రిలయన్స్ వెజిటేబుల్ స్టోర్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. తొలుత కండ్లకోయలో పనిచేస్తూ గత 15 రోజుల క్రితం మామిడిపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాడు.
బుధవారం కూరగాయల లోడుతో కండ్లకోయ నుంచి డీసీఎంలో డ్రైవర్రాజుతో కలిసి ఓఆర్ఆర్ మీదుగా మామిడిపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ముందు వెళ్తున్న మరో డీసీఎంను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పక్కనే కూర్చున్న ఐలయ్య క్యాబిన్లో ఇరుక్కుని తీవ్ర గాయాలతో మృతి చెందగా, డ్రైవర్రాజు గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.