నిజామాబాద్ జిల్లాలో చైనా మాంజాతో వ్యక్తికి గాయాలు

నిజామాబాద్ జిల్లాలో చైనా మాంజాతో వ్యక్తికి గాయాలు

నవీపేట్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం నాల్లేశ్వర్  గ్రామంలో యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో గాయపడ్డాడు. గ్రామానికి చెందిన మణికంఠ్(30) పొలంలో గడ్డి కోసుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా పతంగి మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించిన అనంతరం నందిపేట్  హాస్పిటల్ కు తరలించారు.