రైల్వే సిబ్బందికి మ్యాన్ ఆఫ్​ ది మంత్ భద్రతా అవార్డులు

రైల్వే సిబ్బందికి మ్యాన్ ఆఫ్​ ది మంత్ భద్రతా అవార్డులు

సికింద్రాబాద్​, వెలుగు:  విధి నిర్వహణలో అప్రమత్తత, అంకితభావంతో ఉండే దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లకు చెందిన 9 మంది ఉద్యోగులకు‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులను అందజేశారు. సికింద్రాబాద్​ రైల్​ నిలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​అరుణ్​ కుమార్​జైన్​ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. సికింద్రాబాద్ డివిజన్ 5, విజయవాడ డివిజన్ -3, గుంతకల్ డివిజన్ -1,  నాందేడ్ డివిజన్-1, గుంటూరు డివిజన్ నుంచి ఒకరు ఎంపికయ్యారు.  అవార్డు గ్రహీతల్లో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, కీ -గేట్ మ్యాన్, ట్రాక్ మెయింటెయినర్లు ఉన్నారు. ఉద్యోగులు అంకితభావంతో విధులను నిర్వహిస్తున్నందుకు వారిని జీఎం అభినందించారు. అవార్డులు ఇతర ఉద్యోగులను కూడ ప్రేరేపిస్తాయని,  రైళ్లను సురక్షితంగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వేకు కూడా సాయపడుతాయని ఆయన పేర్కొన్నారు.  

రైల్వే ఉద్యోగులకు సదుపాయాలు కల్పించాలి

రైల్వే ఉద్యోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ కోరారు.  మంగళవారం ఆయన యూనియన్​ నేతలతో కలిసి  మెడికల్ డైరెక్టర్ నిర్మల రాజారాం కలిసి విన్నవించారు. కార్మికులు ఎదుర్కొంటున్న పలు ఆరోగ్య  సమస్యలపై ఆమె దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మజ్దూర్ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బారాటే,  అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ చిలుకా స్వామి, ట్రెజరరీ నర్సింహా రెడ్డి, సెక్రటరీ సమ్మయ్య, చైర్మన్ రాంమ్మోహన్, పాషా తదితరులు ఉన్నారు.