
- ఉప్పల్ పీఎస్లో కేసు నమోదు
- నిందితుడు డిప్యూటీ మేయర్ భర్త డ్రైవర్
ఉప్పల్, వెలుగు: ‘బల్దియా ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా.. ఇల్లు కట్టుకుంటున్నవ్కదా.. డబ్బులియ్యాలి.. లేకపోతే కూల్చేస్తాం’ అంటూ ఓ ఇంటి యజమానిని బెదిరించిన వ్యక్తిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి కథనం ప్రకారం.. మూడు రోజుల కింద ఉప్పల్ మెయిన్ రోడ్డులో ఇల్లు కట్టుకుంటున్న బజార్ నవీన్ గౌడ్ కు తుల్జా సింగ్అనే వ్యక్తి ఫోన్చేశాడు. తాను బల్దియా హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.
ఇంటి నిర్మాణం చేసుకుంటే డబ్బులు ఇవ్వాలని తెలియదా? అంటూ ప్రశ్నించాడు. లేకపోతే ఇంటిని కూల్చివేయక తప్పదని వార్నింగ్ఇచ్చాడు. ఇలాగే వేధిస్తుండడంతో నవీన్ ఉప్పల్పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. కాగా, నిందితుడు తుల్జా సింగ్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ భర్త, కార్మిక నాయకుడు మోతె శోభన్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నట్టు తెలిసింది.