ఇదేందయ్యా ఇది.. ఇట్ల కూడా నడుపుతరా బండి

ఇదేందయ్యా ఇది.. ఇట్ల కూడా నడుపుతరా బండి

రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికి కొందరు మాత్రం వాటిని  అస్సలు పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లు డ్రైవ్‌ చేయడం, అతివేగంగా వెళ్లడం, పరిమితికి మించి లగేజ్‌ను తీసుకెళ్లడం ఇలాంటివి చేస్తున్నారు. ఇవే ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.  కింద వీడియోలో కనిపిస్తున్న ఓ వ్యక్తి  కూడా తన బైక్ పైన  పరిమితికి మించిన లగేజ్‌ను తీసుకెళ్తున్నాడు. ఎంతలా అంటే కనీసం బైక్ పైన  తను కూర్చోడానికి కూడా ప్లేస్‌ లేకుండా వస్తువులతో నింపేశాడు. అతని కాళ్లు కూడా కిందే ఆనుతున్నాయి. ఈ వీడియోను సాగర్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో ‘నా 32GB ఫోన్ 31.9 GB డేటాను తీసుకువెళుతోంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా సోషల్ మీడియాలో విపరీతంగావైరల్ గా మారింది. దీనిపైన తెలంగాణ పోలీసులు కూడా స్పందించారు. మొబైల్‌ దెబ్బతిన్నప్పటికీ డాటా రికవరీ చేయవచ్చు కానీ జీవితాన్ని తిరిగి తీసుకురాలేం. కాబట్టి ప్రజలు తమ ప్రాణాలను, ఇతరులను కూడా ప్రమాదంలో పడకుండా నివారించండి"  అంటూ స్ట్రాంగ్‌ మెసేజ్ ఇచ్చారు.  కాగా ఈ వీడియోని ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు.