సూర్యాపేటలో పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దుండగుడు

సూర్యాపేటలో పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దుండగుడు

సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‭కు చెందిన పోలీస్ వాహనం చోరీకి గురైంది. కొత్త బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగుడు పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున  5 గంటలకు ఈ సంఘటన జరిగింది. గస్తీ విధులు నిర్వహిస్తున్న  పోలీసులు వేరే కేసు కోసం వాహనాన్ని నిలిపివెళ్లారు. ఆ సమయంలో వాహనానికి తాళం ఉండడంతో అది చూసిన దుండగుడు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.