
దొంగలు ఎక్కడికి వెళ్లినా తమ బుద్ధి చూపించకుండా ఉండలేరు. ఎలా దొంగతనం చేయాలా అని చూస్తూ ఉంటారు. తాజాగా ఓ దొంగ దుకాణంలో మద్యం సీసాను కాజేయాలని చూశాడు. కానీ అతగాడి ప్లాన్ ని అతని అండర్ వేర్ బోల్తా కొట్టించింది. ఈ సంఘటన ఎక్కడి జరిగింది అనే విషయం తెలియదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ దొంగ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అక్కడ అన్ని మందు బాటిళ్లు చూశాడు. చాలా సేపు అన్ని బాటిళ్లు చూసిన తర్వాత.. అందులో మంచి కాస్ట్ లీ బాటిల్ ని ఎంచుకున్నాడు. ఇక అంతే తన షార్ట్ నిక్కర్ లో ఆ సీసా వేసుకున్నాడు. అయితే అతని లోదుస్తులు లూజ్ గా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాడు. ఆ సీసా కాస్త కింద పడి పగిలింది. ఆ తరువాత ఆ బాటిల్ ను అక్కడే దాచి అక్కడి పారిపోయేందుకు ప్రయత్నించాడు, కిందపడిన మద్యంపై కాలు వేయగా జారిపడగా... తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోaljaberi_3100 అనే ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు అయింది. ఈ వీడియోను ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి) వేలాది మంది వీక్షించారు. కొంతమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. కొంతమంది ఆయన కర్మ అలా ఉందని కామెంట్ చేయగా.. మరికొందరు చెడ్డ పనులు చేస్తే చెడే జరుగుతుందని రాశారు. ఇంకొకరు దేవుడు, సీసీ టీవీ అన్నీ చూస్తుంటాయని స్పందించారు. అయితే మద్యం బాటిల్ దొంగిలించిన వ్యక్తికి ఈ ఘటన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంది. ఈ వీడియోను చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి...