పిక్నిక్కు వెళ్తే ఇలాంటి పనులు చేయకండి.. ఫ్రెండ్స్ చూస్తుండగా.. చెప్పు కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు

పిక్నిక్కు వెళ్తే ఇలాంటి పనులు చేయకండి.. ఫ్రెండ్స్ చూస్తుండగా.. చెప్పు కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు

పిక్నిక్ కు వెళ్లినపుడు ఊహించని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోని ఘటనలతో స్టూడెంట్స్ గల్లంతైన సందర్భాలు చాలా ఉన్నాయి. సెల్ఫీల కోసం కొందరు, ఫోటీల కోసం కొందరు రిస్క్ లో పడుతుంటారు. కొందరు సాహసం చేయాలని ట్రై చేసి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుంటారు. అలాంటి ఘటనే ఇది. చెప్పు కోసం నీటి ప్రవాహంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ వీడియో చూస్తే ఇలా కూడా చనిపోతారా..? అనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం (జులై 21) సెయొనీ జిల్లాలో ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ కు వెళ్లారు. అందులో ఆయుష్ అనే స్టూడెంట్ చెప్పు జారి నీళ్లలో పడిపోయింది. అయితే ఆ స్లిప్పర్ ను తీసుకునేందుకు ఆయుష్ కర్రతో విశ్వప్రయత్నం చేశాడు. ఒకవైపు ఫ్రండ్స్ రాళ్లు విసురుతూ ఆ చెప్పును దరికి దగ్గరగా వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆయుష్ ఆ కర్రతో చెప్పును అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

నీళ్లలో తేలి ఆడుతున్న ఆ స్లిప్పర్ కర్రకు అందినట్లే అంది మిస్ అవుతుండటం వీడియోలో చూడవచ్చు. అయితే అటువైపు నుంచి ఫ్రెండ్ రాళ్లతో కొడుకు చెప్పును దొరికించుకోవాల్సిందిగా అరుస్తున్నారు. కర్రతో చెప్పను పట్టుకునే చేస్తూ ఉండగా అది ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. 

దీంతో ఆయుశ్ ఇంకాస్త ముందుకెళ్లి ఆ స్లిప్పర్ ను కర్రతో పట్టుకోబోయే ప్రయత్నం చేశాడు. వేగంగా నీళ్లలో వెళ్తున్న చెప్పును పట్టుకునేందుకు స్పీడ్ గా మరికాస్త ముందుకెళ్లిన ఆయుశ్.. దగ్గరికి వెళ్లి ఆల్మోస్ట్ అందుకున్నాడు. కానీ కాలు జారీ, బ్యాలెన్స్ తప్పి నీటి ప్రవాహంలో పడిపోయాడు. అంతే సంగతులు.. ఫ్రెండ్స్ ఎంత అరిచినా.. ఏడ్చినా ఆయుశ్ తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆయుశ్ బాడీని పోలీసులు రికవర్ చేసుకున్నారు. 

20 ఏళ్ల ఆయుశ్ తన ఐదుగురి ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ కు వెళ్లాడు.. చెప్పు నీళ్లలో పడటంతో తీసుకునే ప్రయత్నంలో నదిలో పడి చనిపోయాడని పోలీసు అధికారి పూజా చౌక్సే తెలిపారు.