కరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం

కరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం

కరోనా టెస్టుకు యాంటీ డ్రగ్ అంటూ విషం ఇచ్చి ఓ కుటుంబాన్ని చంపించే ప్రయత్నం చేశాడో వ్యక్తి. ఢిల్లీకి చెందిన ప్రదీప్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ప్రదీప్ భార్యకు హోంగార్డైన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆమెకు హోంగార్డుతో వివాహేతర సంబంధం ఉందని ప్రదీప్ అనుమానించేవాడు. దాంతో హోంగార్డు కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇద్దరు మహిళలను కిరాయికి మాట్లాడుకున్నాడు. వారిని ఆరోగ్య కార్యకర్తలుగా హోంగార్డు ఇంటికి పంపించి.. అతని కుటుంబాన్ని చంపించాలని ప్రదీప్ పథకం వేశాడు.

చాలా చోట్ల ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరోనా లక్షణాలు ఉన్నాయోమో గుర్తిస్తున్నారు. దాన్ని ప్రదీప్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను కిరాయికి మాట్లాడుకున్న ఇద్దరు మహిళలకు విషం నింపిన బాటిల్ ను ఇచ్చి అలీపూర్ లోని హోంగార్డు ఇంటికి పంపించాడు. ఆ మహిళలు ఆరోగ్య కార్యకర్తలుగా హోంగార్డు ఇంటికి వెళ్లి.. ఇంట్లో వారికి యాంటీ కరోనా మందు అను చెప్పి ఆ విషాన్ని వారితో తాగించారు. కాసేపటికి హోంగార్డు కుటుంబమంతా అనారోగ్యానికి గురయ్యారు. వారి పక్కింటివాళ్లు ఇది గమనించి ఆ కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు కుటుంబంపై విష ప్రయోగం జరిగిందని వైద్యులు దృవీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. హోంగార్డు ఇంటి ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హోంగార్డు కుటుంబాన్ని చంపడానికి.. ప్రదీప్ తమతో బేరం మాట్లాడుకున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రదీప్ ను అరెస్టు చేశారు. హత్యాయత్నంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హోంగార్డు కుటుంబం ఆస్పత్రిలో కోలుకుంటుంది.

For More News..

ఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు

వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..