రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన కొత్తకొండ రోజ నవీన్ ఆరో వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సర్పంచ్ స్థానానికి పోటీ చేయగా, తన ప్రత్యర్థిపై దాదాపు 140 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
ఒకే ఎన్నికలో వార్డు మెంబర్, సర్పంచ్ పదవులు దక్కించుకోవడంతో మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వెలువడగానే ఆమె ఇంటికి చేరుకొని పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
