ఓ వ్యక్తికి 220 కోట్ల లాటరీ తగిలింది..ఆ డబ్బు ఏం చేశాడో తెలుసా..

ఓ వ్యక్తికి 220 కోట్ల లాటరీ తగిలింది..ఆ డబ్బు ఏం చేశాడో తెలుసా..

మనకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయనుకోండి. ఏం చేస్తాం..ముందుగా ఎగిరి గంతేస్తాం..ఆ తర్వాత ఏం చేస్తాం.. ఇల్లు, కార్లు, భూములు ఇలా ఎవరికి నచ్చినవి వారు కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడో  ఓ పెద్ద మనిషి తనకు అనుకోకుండా తగిలింది. వెంటనే చేస్తున్న ఉద్యోగం మానేశాడు. హఠాత్తుగా వచ్చిన సంపదతో చిందులు వేయడానికి బదులుగా.. ఆ సంపద ఎలా ఖర్చు చేస్తే తన ఆదాయం పెరుగుతుందో అది చేశాడు. కొత్త సంపద వచ్చి పడింది కదా అని జల్సాలకు పోకుండా జీవితంలో ఏది తనకు ఆనందాన్ని ఇస్తుందో వాటిని చేశాడు. సందపను ఇంకా పెంచుకున్నాడు.. ఆ కథేంటో చూద్దాం రండి.. 

ఆస్ట్రేలియాకు చెందిన క్లిఫ్ లిటిల్.. ఇతను వికలాంగుల కోటా ఉద్యోగం పొందాడు. జీవితం గడచిపోయేంత సంపాదన వస్తోంది. అయితే క్లిఫ్ కు  లాటరీ ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది. మీరు 21 మిలియన్ పౌండ్ల(రూ.220కోట్లు)  లాటరీ గెలుచుకున్నారని.. క్లిఫ్ జాక్ పాట్ కొట్టేశాడు. ఎలాంటి సంకోచం లేకుండా ఉద్యోగానికి వీడ్కోలు చెప్పాడు. 

మరీ అంత డబ్బును క్లిఫ్ లిటిల్ ఏం చేశాడు.. 
హఠాత్తుగా సంపద వచ్చి పడింది కదా.. జల్సా చేద్దాం అని క్లిఫ్ లిటిల్ అనుకోలేదు. ఆ డబ్బును పొదుపుగా ఖర్చు చేయడం మొదలు పెట్టాడు. తన  పిల్లల కోసం కారు, ఆస్తులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత మిగిలి న డబ్బును ఏం చేశాడో తెలుసా.. తనకు ఇష్టమైన గుర్రపు పందెం లో ఇన్వెస్ట్ చేశాడు. లిటిల్ ఓ రేసు గుర్రాన్ని కొనుగోలు చేశాడు. థరోబ్రెడ్ లలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాడు. అతని గుర్రాలలో ఒకటైన సిఫ్రాడో  విజేతగా నిలిచి అతనికి 4 లక్షల 71వేల పౌండ్ల ఆదాయాన్ని సంపాదించింది. 
కొత్త గా సంపద వచ్చి పడినప్పటికీ లిటిల్  జీవన శైలీలో మార్పులు రాలేదు.. డబ్బు రాకముందు ఎలా ఉన్నాడో డబ్బు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. క్లిఫ్ లిటిల్ తన జీవితంలో సాధారణ ఆనందాలను పొందుతున్నాడు.