నేను ఎంచుకునే జానర్స్ ఎక్కువగా మానవీయ సంబంధాలకి, ప్రతి ఫ్యామిలీ రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అది నాకు ప్లస్ అవుతుంది. ఆడియెన్స్ విషయంలో సంక్రాంతికొచ్చి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడనే ఫీలింగ్ ఉంటే చాలు.
లాస్ట్ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ టైమ్‌లో కొంత నెర్వస్‌గా ఉండేది. -ఈసారి కొద్దిగా రిలాక్స్‌గా ఉన్నా. నెర్వస్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది. దానికి కారణం చిరంజీవి గారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేశాం. ఆ పాటకి చిరంజీవి గారు వేసిన స్టెప్స్, ఆ ఈవెంట్లో ఆయన ముందు నేను వెంకటేష్ గారు చేసిన అల్లరి ఇదంతా తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేసింది. భీమ్స్ కంపోజ్ చేసిన మీసాల పిల్లా, విక్టరీ, మాస్ సాంగ్‌తో పాటు ఈ పాటతో మెగా మ్యాజిక్ జరిగింది.
ఇప్పటివరకు టీజర్, ట్రైలర్లో ఎక్కడా కూడా రివీల్ చేయని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. కామెడీతో పాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. చిరంజీవి, నయనతార, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వాళ్లు ఎలా హ్యాండిల్ చేస్తారనేది కొత్త కోణంలో చూపిస్తున్నాం. అది కచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టే కదా అని ఫీల్ అవుతారు.
చిరంజీవి గారు చేసే అల్లరి ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఒక టైం మిషన్లోకి తీసుకెళ్ళినట్టుగా ఉంటాయి. ఆయన్ని నటుడిగా, వ్యక్తిగా అభిమానించే అందరూ సినిమా చూసిన తర్వాత 'వావ్' అంటారనే నమ్మకం ఉంది. ఇందులో చిరంజీవి, వెంకటేష్ లాంటి బిగ్ స్టార్స్‌ని బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో నాకు అంత కేక్ వాక్ అయింది. వీరిద్దరూ ఉన్న ఇరవై నిమిషాల సీన్ నాన్‌స్టాప్ కామెడీగా ఉంటుంది.
ఈ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో తక్కువ వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కంటే నేనే ఎక్కువ కేర్ తీసుకుంటాను. సొంత ప్రొడ్యూసర్‌లాగా ఫీల్ అయి సినిమా చేస్తుంటాను. ప్రొడ్యూసర్ తన లైఫ్‌ని ఫణంగా పెట్టి సినిమా చేస్తారు. ఒక పది రూపాయలు సంపాదించకపోయినా పర్లేదు కానీ బయటకు వచ్చే సమయానికి సేఫ్‌గా ఉండాలి.
ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే చాలు. లక్కీగా నేను చేసిన నిర్మాతలు అందరూ రిలీజ్ ముందు రిలీజ్ తర్వాత చాలా హ్యాపీ.నాగార్జున గారితో కూడా సినిమా చేయాలనుకుంటున్నా. ఆ సినిమా చేస్తే నలుగురు అగ్ర కథానాయకులతోనూ సినిమా చేసిన రికార్డు నాకే ఉండిపోతుంది.
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్. వెంకటేష్ ప్రత్యేకపాత్ర పోషించారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు.
