అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి

అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి
  • అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి
  • జగిత్యాల జిల్లా నడికుడలో ఘటన 


మల్లాపూర్, వెలుగు : అదనపు తరుగు, అదనపు కూలి వసూళ్లపై ప్రశ్నించినందుకు రైతుపై ఓ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు దాడి చేశాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ ​మండలంలోని నడికుడలో సిరిపూర్ ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్​లో బస్తాకు 40.650 కిలోలకు బదులు 2.5 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. క్వింటాల్ కు రూ.30కి బదులు రూ.40 హమాలీ కూలి తీసుకుంటున్నారు. దీనిపై నడికుడకు చెందిన అప్పం చిన్నారెడ్డి అనే రైతు ప్రశ్నించడంతో సెంటర్ నిర్వాహకుడు రాజశేఖర్ దాడి చేశాడు. దీంతో మల్లాపూర్​ పోలీస్ స్టేషన్ లో నిర్వాహకుడిపై రైతు ఫిర్యాదు చేశాడు. తన వడ్లను తొందరగా తూకం వేయాలని చిన్నారెడ్డి గొడవకు దిగాడని, సెంటర్ రికార్డులను చింపడంతో గొడవ జరిగిందని నిర్వాహకుడు రాజశేఖర్​ కూడా ఫిర్యాదు చేశారు.