
భారత ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08.
పోస్టుల సంఖ్య: 75.
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్(ఈ2) 55, ఎగ్జిక్యూటివ్ (ఈ0) 20.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/ ఎంఎంఎస్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, సీఏ, బి.టెక్/ బీఈ, సీఎస్ పూర్తి చేసి ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఎంఏ, మాస్టర్స్ డిగ్రీ, బీబీఏ/ బీఎంఎస్/ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 06.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 27.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 70 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 10 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
పూర్తి వివరాలకు www.shipindia.com వెబ్సైట్లో సంప్రదించగలరు.