మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం(Adiparvam). డైరెక్టర్ సంజీవ్ మేగోటి(Sanjeev Megoti) తెరకెక్కుస్తున్న ఈ సినిమాని.. అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుండి మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగలాపురం నాగమ్మగా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు మంచు లక్ష్మీ. ఈ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మోకాలి వరకు చీర కట్టు, నుదుటన పెద్ద బొట్టుతో మంచు లక్ష్మి ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంటారని చిత్ర బృందం తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ ..అమ్మోరు, అరుంధతి సినిమాల రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని, హై టెన్షన్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా.. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుందని తెలిపారు. ఇక ఇటీవల విడుదలైన హనుమాన్ మూవీ లాగే.. ఆదిపర్వం కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందని తెలిపారు. మరి చాలా రోజుల తరువాత మంచు లక్ష్మి చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
