దక్ష మూవీ టీజర్ రిలీజ్.. పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ పాత్రలో దుమ్మురేపిన మంచు లక్ష్మీ

దక్ష మూవీ టీజర్ రిలీజ్.. పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ పాత్రలో దుమ్మురేపిన మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ ప్రసన్న లీడ్ రోల్‌‌‌‌లో వంశీ కృష్ణ మల్లా దర్శకుడిగా మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘దక్ష’. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో మంచు లక్ష్మి పవర్‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నారు. ఓ వింత ఆకారంలో ఉన్న  ఎలియన్ వంటి ఓ జీవి మనుషుల్ని దారుణంగా చంపే సీన్‌‌‌‌తో ప్రారంభమైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సముద్ర ఖని, విశ్వంత్, సిద్ధిక్, జెమినీ సురేష్ ఇతర పాత్రల్లో కనిపించారు. మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు.  మంచి మెసేజ్‌‌‌‌తో రాబోతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ చెప్పింది. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.