సిరిసిల్ల బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్

సిరిసిల్ల బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్

సినీ నటుడు మంచు మనోజ్  ఓ బాలికను దత్తత తీసుకుని తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజు సందర్భంగా  సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు. తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ లో ఆమెను చేర్పించారు. పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేశాడు. పాపను జాగ్రత్తగా చూసుకుంటానని… ఐఏఎస్ అధికారి కావాలనేది పాప ఆశయమని… ఆమె అనుకున్నది సాధించేందుకు కావాల్సినదంతా చేస్తానని చెప్పాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నాడు.