సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మనోజ్

V6 Velugu Posted on Sep 14, 2021

సైదాబాద్ హత్యాచారంపై తీవ్రంగా స్పందించాడు సినీ నటుడు మంచు మనోజ్. చిన్నారికి జరిగింది అత్యంత క్రూరత్వమన్నాడు. సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారం కి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్..చిన్నారిపై జరిగిన దారుణంపై మనమందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కోరాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు.

ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారన్న మనోజ్.. ప్రభుత్వం, పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని కోరాడు. చత్తీస్ గఢ్ లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని తెలిపాడు. సైదాబాద్ ఘటనకు కారణమైన నిందితుడిని..24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరాడు.

టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని అన్నాడు. చిన్నారి ఫ్యామిలీకి అన్ని విధాలుగా తోడుంటామన్నాడు మంచు మనోజ్.

Tagged Manchu manoj, Saidabad child family, Saidabad girl rape

Latest Videos

Subscribe Now

More News