మాదిగ రిజర్వేషన్ మోదీతోనే సాధ్యం... మందకృష్ణ మాదిగ భావోద్వేగం

మాదిగ రిజర్వేషన్ మోదీతోనే సాధ్యం... మందకృష్ణ మాదిగ భావోద్వేగం

మేము ఈ సమాజంలో మాదిగని చెప్పుకోవడానికి భయం పడ్డామని.. సిగ్గు పడ్డాని మందకృష్ణ మాదిగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సమాజంలో మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారని... ఎంతో వివక్షకు గురయ్యామని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని.. మేము ఊహించని కల ఇది అని మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. 2023, నవంబర్ 11వ తేదీ శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభలో మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , మందకృష్ణ మాదిగ, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. " మన జాతిని ఆదుకునేందుకు ఈ దేశానికి పెద్దన్న ప్రధాని మోదీ వచ్చారు. మోది రాక మన అదృష్టం. మాదిగ రిజర్వేషన్ మోదీతోనే సాధ్యం. పేదరికం తెలుసు కాబట్టే బలహీనవర్గాలకు మోదీ అండగా నిలబడ్డారు. సామాజిక న్యాయం బీజేపీకే సాధ్యం అవుతుంది. దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత మోదీదే. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ మంత్రి లేడు. ఒక్కశాతం జనాభా లేని కులాలకే ప్రధాన్యం ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ మాదిగలను అణచివేశారు. బలహీనవర్గాల నాయకుడు కాబట్టే.. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు ప్రధాని మోదీ. మాదిగ జాతిని ప్రధాని మోదీ గౌరవించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిగలను మోసం చేశాయి. మూడు, నాలుగు సార్లు గెలిచినా.. మాదిగలను మంత్రులను చేయలేదు. సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది కాంగ్రెస్.. చేసి చూపేది బీజేపీ. మా వాటా మాకు దక్కాలని 30ఏండ్లుగా పోరాడుతున్నా. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.. కానీ ఎవరూ చేయలేదు. ఈ దేశ సంక్షేమ ఫలాలు అత్యంత పేదకులాలకు అందాలి.మోదీ మాటివ్వరు.. ఇస్తే అమలు చేయకుండా ఉండరు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తే.. మోదీకి మేము మద్దతిస్తాం.పార్టీలకతీతంగా మోదీకి అండగా నిలబడుతాం. ఓ లక్ష్మణుడిగా మోదీకి తోడుంటా" అని అన్నారు.