- ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబును కోరిన మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలో ఉన్న లిడ్ క్యాప్ కు సంబంధించిన భూములను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబును కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిడ్ క్యాప్ భూములు, ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో శుక్రవారం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, లిడ్ క్యాప్, లెదర్ వర్క్ మీద సమగ్రమైన అవగాహన కలిగిన అధికారిని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని మంత్రిని కోరారు.
