
హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టాయని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. పంటల పరిశీలన పేరుతో కేసీఆర్ తుంగతుర్తికి వస్తున్న నేపథ్యంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తుంగతుర్తిలో ఏమున్నదని వస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ కూతరు కవిత ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నారని, ఆయన కొడుకు కేసుల్లో చిక్కుకున్నారని చెప్పారు. కేసీఆర్ ఇల్లు ఎప్పుడు కూలుతుందా.. అని హరీశ్‌రావు ఎదురు చూస్తున్నారన్నారు. కేసులతో కుటుంబం మొత్తం ఆగమైపోతుందన్నారు. నయీం దగ్గర ఉన్న డబ్బును లెక్కించడానికి రెండ్రోజులు పట్టిందని, ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆక్రమ ఆస్తులు, భూ కబ్జాలన్నీ బయటకు తీస్తామని తెలిపారు.