తిరుమల శ్రీవారి బంగారంతో మంగళ సూత్రాలు : టీటీడీ

తిరుమల శ్రీవారి బంగారంతో మంగళ సూత్రాలు  :  టీటీడీ

తిరుమల:  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకున్నది. వేంకటేశ్వరస్వామికి కానుకల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకు అందే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళ సూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈ రకంగా తయారు చేసిన తాళి బొట్లను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభాపేక్ష లేని ధరను నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి.